
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ బస్టాండ్ కాంప్లెక్స్ పక్కన స్థానిక వ్యాపారులకు ఇబ్బందికరంగా మారిన డబ్బాను తొలగించాలని బస్టాండ్ కాంప్లెక్స్ దుకాణదారులు పురపాలక సంఘం చైర్పర్సన్ గందే రాధిక కమిషనర్ సమ్మయ్యకు మంగళవారం రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1963 నుండి 36 కుటుంబాలు బస్టాండ్ ని నమ్ముకుని చిరు వ్యాపారం చేసుకుంటున్నామని, జమ్మికుంట రోడ్డు నుండి బస్టాండ్ లోపలికి రావడానికి 36 షటర్లకు దారి 18 ఫీట్ల రోడ్డు ఉండెనన్నారు. ఆ రోడ్డులో సలీం అనే వ్యక్తి అక్రమంగా డబ్బా వేశాడని, ఆ డబ్బ ద్వారా మా 36 కుటుంబాల వ్యాపారాలకు చాలా ఇబ్బంది అవుతుందనీ, వ్యాపారాలు నడవక మేము రోడ్డున పడే దుస్థితి వస్తున్నదన్నారు. రోజు మొత్తం మీద షాపు నడిపితే కనీసం కూలి కూడా పడని పరిస్థితి ఉందనీ, ఆ ఒక్క డబ్బ గురించి 36 కుటుంబాల జీవితాలను రోడ్డున పడేస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. అతను అనాధికారికంగా డబ్బా వేసుకొని 36 కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఆ డబ్బా వల్ల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనీ, నెల క్రితం భ్రూణ హత్య చేసి పడేశారని ఆరోపించారు. కావున ఆ డబ్బాను తొలగించి 36 కుటుంబాలకు న్యాయం చేయాలనీ స్థానిక చైర్మన్ కి కమిషనర్ కి బస్టాండ్ షాపింగ్ కాంప్లెక్స్ యజమానుల అసోసియేషన్ అధ్యక్షుడు తాటిపాముల రాము ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ కాంప్లెక్స్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
