
స్వర్ణోదయం ప్రతినిధి విజయవాడ: 232 ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 232 ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 24 విశ్వవిద్యాలయాలు, 208 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిని ఇంజినీరింగ్ కౌన్సిలింగ్లో అందుబాటులో ఉంచనున్నారు. ఇంజినీరింగ్ కౌన్సిలింగ్లో భాగంగా మంగళవారం నుంచి వెబ్ ఆఫ్షన్లకు అవకాశం కల్పించేందుకు ఆన్లైన్లో ఫీజులు, కళాశాలల వివరాలను నమోదు చేయనున్నారు. దీంతో ఇంజనీరింగ్ పూర్తి చేయాలనుకునే విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య మరింత చేరువ కానుంది.
