
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:ఆదివాసి ఎరుకల నిరుద్యోగ యువతకు ఔట్ సోర్స్ కింద ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కూతాడి శ్రీనివాస్ మరియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు హాజరై మాట్లాడుతూ…తెలంగాణలో ఆదివాసి ఎరుకల నిరుద్యోగ యువతకు ఔట్సోర్సు కింద ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ ఆదివాసి ఎలకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు మరియు కరీంనగర్ జిల్లా కమిటీ తరుపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో నిరుద్యోగ యువతతో కల్సి ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనేటి రాజుతో పాటు రాష్ట్ర సహాయ కార్యదర్శి కోనేటి సమ్మయ్య, కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవెల్లి రాజలింగం, కరీంనగర్ జిల్లా కోశాధికారి మానుపాటి మల్లేశం, కరీంనగర్ జిల్లా యూత్ అధ్యక్షులు లోకిని పూర్ణచందర్, కరీంనగర్ జిల్లా ఉద్యోగుల సంఘం నాయకులు లోకిని సారయ్య తదితరులు పాల్గొన్నారు.

