మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా పోలీసులకు రావలసిన పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలనీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లాలో పోలీసులకు రావలసిన ఏరియాస్ టీఏ, డీఏ లతో పాటు పిఆర్సి కల్పించాలన్నారు. ఇతర జిల్లాలో పోలీసులకు విడుదల చేయాగా కరీంనగర్ జిల్లా పోలీస్ లు ఏం పాపం చేశారన్నారు?. జిల్లా లో 800 మంది పోలీసులు ఉన్నారని ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు రావలసి ఉందని ప్రభుత్వానికి గుర్తు చేశారు. జిల్లాలోని పోలీసు కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ జిల్లా మంత్రిగా చెప్పుకుంటున్న పొన్నం ప్రభాకర్ జిల్లా పోలీసులకు పెండింగ్ బకాయిలు విడుదల చేయడంలో జాప్యం ఎందుకు జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి పొన్న ప్రభాకర్ కు సమాచారం తెలిపిన నిర్లక్ష్యంగా వ్యవహరించారని, పోలీసులు అంటే నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు.? ప్రతిరోజు నీ వెంట ఉండి నీకు రక్షణ కల్పిస్తున్న పోలీసులు అంటే ఎందుకు నిర్లక్ష్యమని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకొని ప్రభుత్వంతో పెండింగ్ బకాయిలు విడుదల చేయించాలని కోరారు. పోలీస్ కుటుంబాలు పిల్లలకు స్కూల్ ఫీజు లు చెల్లించాలంటే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం చెల్లించాలని కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- Home
- కరీంనగర్ జిల్లా పోలీసులకు రావలసిన పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి..ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి