మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ నడి ఒడ్డున ఉన్న అంబేద్కర్ చౌరస్తా ఎదురుగా గల పాపారావు బొందలో చిరు వ్యాపారాలు చేసుకునే పండ్ల బండ్లకు సోమవారం రాత్రి నిప్పండుకుని కాళీ బూడిదయ్యాయి. అయితే ఒక దిక్కు వానలు కురుస్తుండగానే పండ్ల బండ్లకు పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగిందా? లేదా ఎవరైనా కావాలని పండ్ల బండ్లకు నిప్పంటించారా! తెలియదు కానీ ఒకేసారి అన్ని పండ్ల బండ్లకు మంటలు చేలరేగి పూర్తిస్థాయిలో ఖాళీ బూడిద కావడం పట్టణంలో సంచలనం కలిగించింది. నిత్యం ఉదయం నుండి రాత్రి వరకు పండ్లు అమ్ముకుని వచ్చిన డబ్బులను అక్కడే దాచుకునే చిరు వ్యాపారుల పండ్లు నగదు పెద్ద మొత్తంలో దగ్ధమైనట్లుగా తెలుస్తుంది. ఈ అగ్ని ప్రమాదంలో భారీగానే ఆస్తి నష్టం జరిగి ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఏదిఏమైనాప్పటికీ వర్షం పడుతుండగానే నిప్పురవ్వలు చెలరేగి పెద్ద ఎత్తున మంటలు లేవడం పలువురిని ఆలోచింపజేస్తుంది. స్థానిక ఫైర్ ఇంజన్, స్థానిక యువకులు మంటలు ఆర్పినప్పటికీ బండ్లు మొత్తం ఖాళీ బూడిద అయ్యాయి. పలువురు యువకులు స్వచ్ఛందంగా మంటలు ఆర్పేందుకు కృషి చేశారు. ఒకటి కూర పడుతుండగానే పెద్ద ఎత్తున మంటలు చిలరేగడం పలువురిని ఆందోళనకు గురిచేస్తుంది.
*అగ్ని ప్రమాదంపై చిరు పండ్ల వ్యాపారులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్. *
హుజురాబాద్ పట్టణ నడి ఒడ్డున ఉన్న అంబేద్కర్ చౌరస్తా ఎదురుగా గల పాపారావు బొందలో చిరు వ్యాపారాలు చేసుకునే పండ్ల బండ్ల తడకల షెడ్లకు సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు నిప్పండుకుని కాళీ బూడిద కావడంతో చిరు వ్యాపారులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్. ప్రమాద జరిగిన సంఘటనపై పోలీసు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకొని బాధిత చిరు పండ్ల వ్యాపారులను కలువనున్నారు..