
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా ఎదురుగా పాపారావు బందులో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన చిరు వ్యాపారుల సమస్యను జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తానని కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ఓడితెల ప్రణవ్ హామీ ఇచ్చారు. మంగళవారం ఉదయం రాత్రి దగ్ధమైన చిరు వ్యాపారుల దుకాణాలను వోడితల ప్రణవ్ నాయకులు, కార్యకర్తలతో కలిసి సందర్శించి పరిశీలించారు. బాధితులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే వారికి పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య పాలకవర్గ సభ్యులను కోరారు. అగ్నిప్రమాదంలో కాలిపోయిన షాపులను పునర్నిర్మానానికి కృషి చేస్తానని, పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి త్వరలోనే సమస్య తీసుకువెళ్తానని చెప్పారు.
అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ప్రణవ్ స్పష్టం చేశారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉన్నారు.










