
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదంలో కాలిపోయిన చిరు వ్యాపారులకు అండగా ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. మంగళవారం అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడారు. అగ్ని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుని, బీఆర్ఎస్ పార్టీ తరఫున సంఘీభావం ప్రకటించారు. బాధితులు అధైర్య పడవద్దని సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పూర్తిస్థాయిలో ఆదుకుంటామన్నారు. అగ్ని ప్రమాదంలో కాలిపోయిన ఆస్తి విలువను అంచనా వేయాల్సిందిగా అధికారులకు సూచించారు. సాధ్యమైనంత త్వరగా చిరు వ్యాపారుల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చిరు వ్యాపారుల దుకాణాలను పునర్నిర్మించడానికి తన వంతుగా వ్యక్తిగతంగా ఒక్కో బాధితునికి రూ.10,000 ఆర్థిక సాయం అందిస్తానన్నారు. అదేవిధంగా మూడు రోజుల్లోపు ప్రభుత్వం చొరవ తీసుకొని ఒక్కో షాపుకి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించాలని ఆయన అన్నారు. పునర్నిర్మానానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సంఘటనకు సంబంధించి షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేక ఇంకెవరైనా కావాలనే చేశారో తెలుసుకోవాలని పోలీసు అధికారులను విజ్ఞప్తి చేశారు. కాగా అగ్ని ప్రమాదంలో షాపులు కాలిపోయిన విషయం తెలియడంతో సంధ్యానే మహిళ స్పృహ తప్పి పడిపోయింది. విషయం తెలుసుకున్న ఆమెను ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పరామర్శించారు. అధైర్యపడవద్దని తప్పక అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ గందె రాధిక శ్రీనివాస్, కౌన్సిలర్లు కేసిరెడ్డి లావణ్య నర్సింహరెడ్డి, ప్రతాప రు జారుకుంటారు తిరుమల్ రెడ్డి, మొలుగు సృజన పూర్ణచందర్, తాళ్లపల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.




