
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈనెల 26, 27, 28 తేదీలలో హైదరాబాదులో జరిగే ఫోటో ఎక్స్ పో కార్యక్రమన్ని విజయవంతం చేయాలని మండల ఫోటోగ్రాఫర్స్ అధ్యక్షుడు మాచర్ల రాజు గౌడ్ విజ్ఞప్తి చేశారు. హుజురాబాద్ మండల ఫోటో అండ్ వీడియో అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఫంక్షన్ హాల్ లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈనెల 26, 27, 28వ తేదీలలో హైదరాబాదులో జరిగే ఫోటో ఎక్స్పో కార్యక్రమ పోస్టర్లను మండల ఫోటోగ్రాఫర్స్ అధ్యక్షుడు మాచర్ల రాజు గౌడ్ ఆధ్వర్యంలో పోస్టర్ ను ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం పెళ్లిళ్ల సీజన్ కి ముందు ఫోటో ఎక్స్పో పెట్టడం జరుగుతుందనీ, అధునాతన ఫోటో కెమెరాలను ఆ ఎక్స్పో ద్వారా ఫోటోగ్రాఫర్లకు పరిచయం చేస్తారన్నారు అలాగే ఫోటోగ్రాఫర్లకి కొత్త మెలకువలు కూడా నేర్పిస్తారనీ, ఇట్టి పోస్టర్ ఆవిష్కరణలో కరీంనగర్ జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరి రవి, రాష్ట్ర గౌరవ సలహాదారు కేదార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తుమ్మ చెందుతో పాటు హుజురాబాద్ మండల ప్రధాన కార్యదర్శి ఎం డి యాకుబ్ అలీ, కోశాధికారి తలకొక్కుల ప్రసాద్, ఉపాధ్యక్షులు రాజేష్, శ్రీశైలంతో పాటు జమ్మికుంట, ఇల్లంతకుంట మండల అధ్యక్షులు, కార్యదర్శులుతోపాటు హుజురాబాద్ మండలం ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులందరూ పాల్గొన్నారు.
