
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో పిచ్చి కుక్కల స్వైర విహారం చేసి 30 మందిపై దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. బుధవారం రాత్రి మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి గ్రామంలో, పట్టణంలోని ప్రతాపవాడ, మామిండ్లవాడ, గాంధీనగర్, పద్మనగర్, విద్య నగర్, ఏకలవ్యనగర్ లలో 30 మందిని పిచ్చి కుక్క లు సాయంత్రం నుండి రాత్రి వరకు కరువగా పలువురికి గాయాలు అయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే ఇటీవలనే బల్దియా అధికారులు హైదరాబాదు నుండి ప్రత్యేకంగా కుక్కలను పట్టే వారిని తీసుకువచ్చి సుమారు ఐదు రోజులపాటు 500 కుక్కలను పట్టి అడవి ప్రాంతానికి తరలించి వదిలేశారు. ఒక్కొక్క కుక్కకు బల్దియా 300 నుండి 500 వరకు వారికి చెల్లించగా ఇక వీధి కుక్కలు లేవు అనుకుంటున్న తరుణంలో ఒకేరోజు పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో వెరీ కుక్కలు వీరవిహారం చేసి కనిపించిన ప్రతి ఒక్కరిపై దాడి చేసి కలవడంతో గాయాలకు గురై ఆస్పత్రి బాట పట్టారు. హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఎంతమంది ఒకేసారి రావడంతో సరిపడా కుక్క కాటుకు వేసే రాబిపూర్ ఇంజక్షన్లు లేక పలువురు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందారు. ఒకరిని మాత్రం వరంగల్ ఎంజీఎం కు పంపడంతో అక్కడ కోలుకుంటున్నారు. బల్దియా అధికారులు పట్టణంలో పూర్తిస్థాయిలో వీధి కుక్కలు, వెర్రి కుక్కల భారి నుండి ప్రజలను రక్షించాలని పలువురు కోరుతున్నారు. కాగా పిచ్చికుక్క జమ్మికుంటలో పలువురిని కరిచి హుజురాబాద్ కు వచ్చి ఇక్కడ 30 మందికి పైగా కరిచి ఇక్కడి నుండి సైదాపూర్ మండలం చింతలపల్లికి వెళ్లి అక్కడ ఇద్దరినీ కరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. హుజరాబాద్ మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్, విద్యానగర్, బోర్నp ల్లిలో మున్సిపల్ సిబ్బంది వీధి కుక్కల దాడి నుండి ప్రజలను కాపాడేందుకు గస్తీలో ఉంచినట్లు మున్సిపల్ చైర్పర్సన్ గందే రాధిక శ్రీనివాస్ ఒక ప్రకటనలు తెలిపారు.









