
స్వర్ణోదయం ప్రతినిధి, ముంబై: మరాఠా సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ ఉపయోగించిన ఆయుధం ‘వాఘ్ నఖ్’ లండన్ మ్యూజియం నుంచి ముంబై చేరుకున్నట్లు మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ బుధవారం తెలిపారు. దాదాపు 350 ఏళ్ల తర్వాత శివాజీ ఆయుధం స్వదేశానికి తిరిగి వచ్చిందని, దీనిని సతారకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. సతారాలో వాఘ్ నఖ్ కు ఘన స్వాగతం పలుకుతామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శంభురాజ్ దేశాయ్ తెలిపారు. చత్రపతి శివాజీ ఆయుధాన్ని చూసేందుకు గత కొన్నేళ్లుగా మహారాష్ట్ర ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పెట్టకేలకు ప్రజల కోరిక తీర్చడంలో ప్రభుత్వం కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
