
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజూరాబాద్ : మహిళలకు ప్రకృతి ప్రసాదించిన వరం గోరింటాకు అని పలువురు ఆర్యవైశ్య సంఘం మహిళలు పేర్కొన్నారు. పట్టణంలోని కన్యకాపరమేశ్వరి దేవాలయ ఆవరణలో ఆర్యవైశ్య స్వచ్చంద సంస్థ మహిళలు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని జరుపుకున్న గోరింటాకు ఉత్సవాలు పలువురుని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. ప్రతి శుభకార్యాల్లో గోరింటాకుకు ప్రత్యేక స్థానం ఉంటుందని, శరీరంలోని వేడిని గ్రహించి చల్లదనాన్ని ఇస్తుందన్నారు. చర్మవ్యాధులకు సంబంధించిన వ్యాధులు రాకుండా కాపాడుతుందన్నారు. వయసుతో సంబంధం లేకుండా మహిళలందరూ గోరింటాకును ఇష్టపడతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మహిళలు ముక్క అరుణ, కటకం అరుణ, క్యాస భారతి, కటకం జ్యోతి, శ్రీకోఠి త్రివేణి, శివనాథుని స్వప్న, నగునూరి శైలజ, గోలి హిమబిందు, ఆర్యవైశ్య స్వచ్చంద మహిళలు పాల్గొన్నారు.






