స్వర్ణోదయం ప్రతినిధి, భూపాలపల్లి :– రాజకీయ కక్షతో ప్రాజెక్టు్ల్లో నీళ్లు నింపకుండా రైతులకు అన్యాయం చేయొద్దని తెలంగాణ ప్రభుత్వానికి మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఈరోజు కాలేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ..మేడిగడ్డ మేడిపండు అయిందని, లక్ష కోట్ల ప్రాజెక్టు కొట్టుకపోయిందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలన్నీ ఉత్తవే అని తేలిపోయిందన్నారు. కేసీఆర్‌ను బద్నాం చేసేం దుకే 8నెలలుగా నీళ్లు నింపకుండా కాంగ్రెస్ చేసిన ప్రయత్నం అందరికీ కనబడుతూనే ఉందన్నారు. కేటీఆర్. క్షేత్రస్థాయి పరిశీలనతో ఎండుతున్న రిజర్వాయర్లు, మండు తున్న రైతుల గుండెల్ని అసెంబ్లీ దృష్టికి తెచ్చేందుకే తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించామన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ డాక్టర్ వివేకానంద, ఎమ్మెల్సీ ఎల్ రమణ, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.
- Home
- కాంగ్రెస్ ప్రభుత్వం కేసిఆర్ ను బద్నాం చేసింది : మాజీ మంత్రి కేటీఆర్