
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: బడ్జెట్ లో హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్కకు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడుతూ..జీహెఎంసీ, వాటర్ బోర్డు, మెట్రో లకు ప్రభుత్వం ఆర్థిక ఊతం ఇచ్చిందన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ కు ఏం తెచ్చారన్నారు. టూరిజం మంత్రిగా ఉన్నా కిషన్ రెడ్డి చేసిందేమి లేదు అని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నిధులు తెచ్చి కిషన్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులు అయినా రాష్ట్రానికి ఉపయోగం లేదు అని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఇచ్చినందుకా రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్నారా అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ ప్రిపరేషన్ కు ముందే రాష్ట్ర అవసరాలను కేంద్ర ప్రభుత్వంకు తెలియజేసామన్నారు. అయినా సహకారం లేదు అని, గంగా ప్రక్షాళనకు బడ్జెట్ కేటాయింపులు చేసిన కేంద్రం, మూసీ అభివృద్ధికి ఎందుకు ఇవ్వరు అని పేర్కొన్నారు.
కారణం లేకుండా కేసీఆర్ నీతి అయోగ్ సమావేశానికి వెల్లలేదు అని అన్నారు. కేంద్ర బడ్జెట్ లో మాకు అన్యాయం జరిగింది.. అందుకే నిరసన తెలియజేయడం కోసమే నీతిఅయోగ్ సమావేశాన్ని బైకాట్ చేస్తున్నామన్నారు. తమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టకపోవడం వల్ల భారీ నష్టం జరిగిందని చెప్పారు. గేట్లు తెరవడానికి మీరు పోటుగాళ్ళా..!అని అన్నారు. మెడిగడ్డ దగ్గర నీరు పంప్ చేసే అవకాశం లేదని ఎన్డిఎస్ఎ చెప్పిందని గుర్తు చేశారు. కేటీఆర్ యువరాజు కాదు, హుకుంలకు, అల్టిమేటంకు బయపడేది లేదని స్పష్టం చేశారు.






