మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలో గతంలో నాటిన కోనో కార్పస్ మరియు ఏడాకుల చెట్ల వల్ల వచ్చే దుష్ఫలితాలను నివారించుటకై పట్టణ పరిధిలో ఉన్న ఈ చెట్లను తక్షణమే తొలగించాలని విద్యానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు జీకే రైతు మిత్ర సమన్వయ సమితిల ఆధ్వర్యంలో హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు అనారోగ్యాన్ని కలిగించే శ్వాస కోస వ్యాధులను కలిగించే, భూగర్భ జలాలను అధికంగా తీసుకుని, పర్యావరణానికి కీడు చేసే కోనో కార్పస్ మరియు ఏడాకుల చెట్లను తక్షణమే తొలగించి ప్రజలను అనారోగ్యంల నుంచి కాపాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు జీకే రైతు మిత్ర సమన్వయ సమితి సాగి వీరభద్రరావు, చందుపట్ల జనార్ధన్, గూడూరి స్వామిరెడ్డి, బత్తుల మనోజ్, పసుల స్వామి, కోటోజు జ్యోతిరాణి, బండ సంపత్ రెడ్డి, కొన్ని రాజిరెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
- Home
- మునిసిపల్ పరిధిలో నాటిన కోనో కార్పస్ మరియు ఏడాకుల చెట్లను తక్షణమే తొలగించాలని కమిషనర్ కు వినతి