మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఓ కేసులో నిందితునికి ఎనిమిది నెలల జైలు శిక్ష 300 రూపాయలు జరిమాన విధిస్తూ హుజురాబాద్ ఫస్ట్ అడిషనల్ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. వివరాలలోకి వెళితే.! తేదీ 09.02.2024 రోజున హుజురాబాద్ పట్టణము కొత్తపెళ్లికి చెందిన ఫిర్యాదురాలు తన ఇంటి ప్రక్కన ఉండే బుర్ల చక్రపాణి అనే వ్యక్తి అకారణంగా ఫిర్యాది ఇంటిలోకి ప్రవేశించి ఒక కత్తి పట్టుకొని వచ్చి నిన్ను చంపుతాను అంటూ తల వెంట్రుకలు పట్టి కత్తితో బెదిరించగా ఫిర్యాదురాలు హుజురాబాద్ పోలీస్ స్టేషన్ కు వచ్చి దరఖాస్తు చేసిందన్నారు. హుజురాబాద్ పోలీస్ లు కేసు నమోదు చేసి పరిశోధన జరిపి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో చార్జిషీటు వేయగా శుక్రవారం ఫస్ట్ అడిషనల్ కోర్టులో ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం జడ్జి శ్రీసాయి పద్మ నిందితునికి ఎనిమిది నెలల జైలు మరియు 300 రూపాయలు జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారన్నారు. ప్రాసిక్యూషన్ తరపున అప్పటి పిపి గాయత్రి ఫిర్యాదు తరఫున వాదించగా హుజురాబాద్ ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐ, కోర్టు కానిస్టేబుల్ యూసుఫ్ సాక్షులను కోర్టులో హాజరుపరచగా సాక్షదారాలు విన్న అనంతరం నిందితునికి శిక్ష విధించారు.
నిందితునికి శిక్ష పడేటట్లు చేసిన హుజురాబాద్ పోలీస్ వారిని ఫిర్యాదురాలు మరియు వారి తరపున బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.