హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన..!నియోజకవర్గంలో ఇటీవల మరణించిన కుటుంబాలకు పరామర్శ.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుస్నాబాద్, ఆగస్టు3:
హుస్నాబాద్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన చేశారు. నియోజకవర్గంలోని హుస్నాబాద్, చిగురుమామిడి, వెన్కేపల్లి సైదాపుర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో పలు గ్రామాల్లో పర్యటించారు. నియోజకవర్గంలో ఇటీవల వివిధ కారణాలతో పలువురి మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక గ్రామాల్లో పర్యటనలో భాగంగా పార్టీ కార్యకర్తలు సామాన్య ప్రజలతో ముచ్చటించారు. రోడ్డుపై ఆర్టీసి బస్సు ప్రయాణికులతో ముచ్చటించారు. మహిళలు ఉచితంగా అందుతున్న ప్రయాణంపై ఆరాధిసారు. ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ స్కీమ్స్ లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 కి గ్యాస్ అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఎడిట్ ఆప్షన్ ఇచ్చారని వెంటనే అధికారులకు డీటైల్స్ ఇవ్వాలని సూచించారు.

చిగురుమామిడి మండలంలోని చిన్న ములకనూరు వెళ్తుండగా దారిలో వరి నాట్లు వేస్తున్న రైతులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ముచ్చటించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేసిందని ఇప్పటికే లక్ష ,లక్ష 50 వేల లోపు ఉన్న వారికి రుణమాఫీ పూర్తయిందని వారికి వెల్లడించారు. ఒక వేళ రైతు రుణమాఫీ కానీ వారు ఎవరైనా ఉంటే మండల వ్యవసాయధికారిని కలిసి వివరాలు ఇవ్వాలని రైతులకు సూచించారు.తమ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని.. గతంలో పంట నష్టపోయిన వారికి ఎలాంటి నష్ట పరిహారం వచ్చేది కాదని తెలిపారు. తమ ప్రభుత్వం రాగానే పంట నష్టపరిహారాన్ని చెల్లించామన్నారు. మహిళా రైతులతో వరి నాట్లు ఎలా జరుగుతున్నాయని, వ్యవసాయ పనులు జరుగుతున్న తీరు పై ఆరా తీశారు. వ్యవసాయ పనుల్లో మహిళా రైతు పాడిన పాటను ఆసక్తిగా గమనించారు. ఈ సందర్భంగా రైతులు వారి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సమస్య పరిష్కారంపై అధికారులను ఆదేశించారు.

చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామంలో పలు కాలనీల్లో బైక్ పై పర్యటించారు. గ్రామంలో ఇటీవల మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు. గ్రామంలో ఉన్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. హుస్నాబాద్ రైతుల కల తీరుతుందని ఇచ్చిన మాట ప్రకారం గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నామని కాలువలు భూసేకరణ పెండింగ్ పనులు కోసం 437 కోట్లు విడుదలకు మొన్ననే క్యాబినెట్ ఆమోదించిందనీ నియోజకవర్గ ప్రజలతో ముచ్చటించారు. వచ్చే సీజన్ లోపు గౌరవెల్లి నుండి నీళ్ళు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే పలు రోడ్లకు సంబంధించిన పనులు నడుస్తున్నాయని వాటి పనులు వేగంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!