మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జినీయస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఇందిర వన ప్రభ కార్యక్రమంలో భాగంగా చైర్మన్ వి నరేందర్ రెడ్డి పాఠశాల ఆవరణలో సోమవారం మొక్కలు నాటారు. పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మొక్కలను, బహుమతులను ఆందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, వాతావరణ కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. విద్యార్ధులు తమ ఇంటి ఆవరణలో, ఇంటి ముందు మొక్కలు నాటాలని సూచించారు. మొక్కల పెంపకంతోనే మానవాళి మనుగడ సాధ్యం అవుతుందన్నారు. సకాలంలో వర్షాలు పడేందుకు చెట్లు ఎంతగానో దోహదం చేస్తాయని, స్వచ్ఛమైన గాలి మానవాళికి అందించేందుకు తోడ్పడుతాయన్నారు. మొక్కలు నాటడం వల్ల కలిగే లాభాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు, ఉపాద్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
- Home
- ఆల్ఫోర్స్ లో మొక్కలు నాటిన చైర్మన్ నరేందర్ రెడ్డి