
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయిన స్మార్ట్ ఫోన్ లను గుర్తించేందుకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి కనిపెట్టి ఒకేసారి 8 మంది బాధితులకు రూ. లక్ష 50 వేల విలువచేసే ఫోన్ లను అప్పగించి హుజురాబాద్ టౌన్ సిఐ జి తిరుమల్ శభాష్ అనిపించుకున్నారు. గురువారం హుజురాబాద్ పోలీస్ స్టేషన్ SHO జీ తిరుమల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువ మొబైల్స్ పోతున్నాయని ఫిర్యాదులు వస్తుండడంతో వాటిని రికవరీ చేయడానికి పిఎస్ లో ఒక టీం ఏర్పాటు చేశారు. టెక్నాలజీ ఉపయోగించి ఈరోజు 8 స్మార్ట్ మొబైల్స్ అందాద రూ.లక్ష 50వేల రూపాయల కంటే ఎక్కువ విలువ చేసే మొబైల్స్ ను గుర్తించి వాటిని బాధితులకు సీఐ స్వయంగా అందజేశారు. పోగొట్టుకున్న మొబైల్స్ ను తిరిగి తీసుకున్న వారందరూ టౌన్ సిఐ తిరుమల్ కు, పోలీసులకి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఎవరైనా తమ మొబైల్స్ పోయిన వాటిని CEIR పోర్టల్ లో అప్లై చేస్తే వాటిని టెక్నాలజీ ఉపయోగించి తీసుకువస్తామని తెలిపారు.
