
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని గణేష్ నగర్ లో ఆదివాసి తోటి (బర్డు గోండ్) సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు షి షెడమాకి బిక్షపతి, రెండవ వార్డ్ కౌన్సిలర్ బర్మావత్ యాదగిరి నాయక్ లు ఆదివాసి ఆరాధ్యుడైన కొమురం భీం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. సమాజంలో అట్టడుగు వర్గాలైన ఆదివాసీల జీవనస్థితిగతులు వేటికీ మారలేదని అన్నారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన తాము సామాజికంగా రాజకీయంగా కూడా పూర్తిగా చివరి స్థాయిలో ఉన్నామని చెప్పారు. తమకు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రయోజనం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు గాని ఇందిరమ్మ ఇండ్లు గాని తమకు కేటాయించలేదని ఇప్పటికైనా ప్రభుత్వం ఆదివాసీల ఆకాంక్షలు తీర్చాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఆత్రం శోభన్, ఆత్రం సదానందం, గేడం అశోక్, సోయం సమ్మయ్య, సురేష్, శ్రీనివాస్, గుర్రాల గిరిబాబు, అజయ్, సతీష్, అశోక్, షేడమాకి ప్రతాప్, రాజేష్, వినీల్, కృపాకర్, గేడం జయ, శడమాకి సబిత, ఆత్రం శ్రావణి తదితరులు పాల్గొన్నారు.






