మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గ్లోబల్ శో టో కాన్ కరాటే డో ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ పొందిన విద్యార్థుల ఇటీవల కరీంనగర్ జిల్లాలోని టేకుర్తి రాజశ్రీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన గౌరు నారాయణరెడ్డి మెమోరియల్ జాతీయస్థాయి కరాటే పోటీలలో పాల్గొని 8 సంవత్సరాల విభాగంలో గౌసియా ఫాతిమా కటాస్ లో గోల్డ్ మెడల్, 9 సంవత్సరాలు భాగంలో జున్ను శ్రీ ప్రణవి కటాస్ గోల్డ్ మెడల్ 8 సంవత్సరాల విభాగంలో, హుమేరాతస్ నిమ్ కటాస్ లో గోల్డ్ మెడల్ 11 సంవత్సరాల విభాగంలో, ఎస్కే సదుల్లా బాబా సిల్వర్ మెడల్ బహుమతులు సాధించినట్లు కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ తెలిపారు. కాగా విద్యార్థులను ఈరోజు ఉదయం హుజురాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో టౌన్ సిఐ గుర్రం తిరుమల్ గౌడ్ చేతుల మీదుగా మెడల్స్ సర్టిఫికెట్స్ అందజేసి విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమములో తెలంగాణ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు చందుపట్ల జనార్దన్ మాట్లాడుతూ కరాటే తన ఊపిరి, తన ధ్యాస, తన ప్రాణం అనే విధంగా కృషి చేస్తున్న కరాటే తపస్వి ఎస్కే జలీల్ ని అభినందిస్తూ తమ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ మరెన్నో జాతీయ అంతర్జాతీయ స్థాయి బహుమతులు సాధించుట కొరకు పట్టుదలతో ముందుకు వెళ్లాలని కోరారు. సమాజంలోని ప్రతి ఒక్క అమ్మాయికి విద్యతోపాటు కరాటే తమ ఆత్మ రక్షణ కొరకు అవసరమని తెలియజేశారు. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తించాలని కోరినారు న్యూ కాకతీయ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బద్దుల రాజ్ కుమార్, కాంగ్రెస్ మైనార్టీ నాయకులు మొహమ్మద్ ఖలీద్ హుస్సేన్, మొహమ్మద్ తౌఫిక్ కాంగ్రెస్ నాయకులు, ఉప్పు శ్రీనివాస్ తల్లిదండ్రులు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.