-అభివృద్ధి కోసం 15 లక్షల కేటాయింపు
-ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేసిన ఎమ్మెల్యేకు పలువురు అభినందనలు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నాడు కలకలలాడింది నేడు వెలవెల పోయింది అంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆస్పత్రిలో సరైన వైద్య సిబ్బంది లేరని, వెంటనే వైద్యులను నింపకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పడంతో దిగివచ్చిన ప్రభుత్వం కలెక్టర్ ఆదేశాలతో బుధవారం నలుగురు డాక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ. చేసిందనీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.. హుజురాబాద్ ఆసుపత్రిలో ఆరుగురు గైనకాలజిస్ట్ లు ఉండేవారని, నెలకు దాదాపు 200కు పైగా డెలివరీలు జరిగేవని, హుజురాబాద్ కు ఆరుగురు గైనకాలజిస్ట్లతోపాటు జమ్మికుంటకు ఇద్దరినీ కేటాయించాలన్నారు. అలాగే ఆర్థోపెడిక్ గతంలో ఇద్దరు ఉంటే ఇప్పుడు ఒక్కరు కూడా లేరని, జనరల్ సర్జన్లు ఇద్దరు ఉండే ఇప్పుడు లేరని, ఈఎన్టీ కూడా లేరని, అనస్తీసియా 5 ఉండేవారని ప్రస్తుతం ఇద్దరే ఉన్నారని, ఇంతమందిని ట్రాన్స్ఫర్ చేస్తే హుజురాబాద్ ఆసుపత్రి ఎలా నడుస్తుందో చెప్పాలన్నారు. వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి చొరవ తీసుకొని హుజురాబాద్ ఆసుపత్రికి అవసరమయ్యే డాక్టర్లతో పాటు సిబ్బందిని కేటాయించాలని ఇలాంటి పలు అంశాలతో కూడిన సమస్యలన్నిటిని, ముగ్గురు మంత్రులతోపాటు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం కలెక్టర్ తో కూడా మాట్లాడి హుజురాబాద్ ఆసుపత్రికి వైద్యుల కొరత గురించి వివరించారు. వీటన్నిటిని పరిగణనకు తీసుకున్న కలెక్టర్ స్పందించి ప్రస్తుతం నలుగురిని డాక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు హుజురాబాద్ జమ్మికుంట ఆసుపత్రుల అభివృద్ధి కోసం 15 లక్షలు కూడా కేటాయించారు. దీనిపై స్పందించి వైద్యుల నియామకం కోసం కృషిచేసిన కౌశిక్ కలెక్టర్ కి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన కౌశిక్ రెడ్డిని నియోజకవర్గంలోని పలువురు అభినందిస్తున్నారు.