-ఘనంగా వొడితల ప్రణవ్ పుట్టిన రోజు వేడుకలు.
-కార్యకర్తలతో,అభిమానులతో ఉత్సాహంగా గడిపిన వొడితల ప్రణవ్
- అటు జెండా పండుగ ఇటు ప్రణవ్ బర్త్డే సెలబ్రేషన్స్ తో కిక్కిరిసిన పార్టీ ఆఫీస్.
- ఆన్ని మతాల వారి ఆశీర్వాదాలు తీసుకున్న ప్రణవ్.
- అనాధ పిల్లల మధ్య పుట్టిన రోజు వేడుకలు.
- పుట్టిన రోజున రైతులకు 2 లక్షల రుణమాఫీ కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రణవ్.
- వివిధ మాధ్యమల ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పలువురు నాయకులు.
- మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి, హుజురాబాద్:
హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి వొడితల ప్రణవ్ జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన నివాస స్థలం అయిన సింగపూర్ లో ఉదయం నుండే అభిమానుల కోలాహలంతో సందడిగా మారింది. ప్రణవ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు రక్త దాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కాగా ఉదయాన్నే పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ తర్వాత ఆన్ని మతాల వారు ఆశీర్వాదాలు అందజేశారు. అనంతరం చెల్పూర్ లోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, ఇళ్ళందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు స్వామి వారి ప్రసాదంతో పాటు ఆశీర్వాదం అందించారు. అనంతరం జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ప్రణవ్ పాల్గొన్నారు. పుట్టిన రోజు సందర్భంగా అన్నదానం నిర్వహిస్తున్న ప్రణవ్ నిండు నూరేళ్ళ ఆయుష్షుతో వర్ధిల్లాలని వారు కోరుకున్నారు. జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను ఆయన కట్ చేసి, కొత్తపల్లిలోని అనాధశ్రయంలో పిల్లల మధ్య పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు.అనంతరం మారుతినగర్ లోని అయ్యప్పస్వామీ దేవాలయంలో పుట్టిన రోజు సందర్భంగా అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. హుజురాబాద్ తో పాటు ఆన్ని మండలాల్లో నాయకులు, కార్యకర్తలు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ నా పుట్టిన రోజున రైతులకు 2 లక్షల రుణమాఫీ కావడం సంతోషాన్ని కలిగించిందని, రైతే-రాజు అన్న పదానికి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే సార్థకం చేస్తుందని, చెప్పిన విధంగా ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ చేసి రైతుల కన్నీళ్లు తుడిచామని, రాబోయే కాలంలో ప్రజలకు మరింత సేవ చేస్తానని, హుజురాబాద్ ప్రాంతంలో ఉన్న సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట, కమలాపూర్ మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.