పల్లె నుంచి పట్టణం దాకా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం హుజూరాబాద్ ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో, ప్రజలు, అధికారులు పల్లె నుంచి పట్టణం దాకా ఘనంగా నిర్వహించారు. గురువారం కేసి క్యాంపులోని ఆర్డిఓ కార్యాలయంలో, ఎంపీపీ కార్యాలయంలో ఆర్డిఓ, ఇన్చార్జి స్పెషల్ ఆఫీసర్ రమేష్ బాబు, ఏసీపి కార్యాలయంలో ఏసీపి శ్రీనివాస్ జి, ఎక్సైజ్ కార్యాలయంలో సిఐ శ్రీనివాస్, రెవెన్యూ కార్యాలయంలో తహసిల్దార్ కే కనకయ్య, సర్కిల్ కార్యాలయంలో టౌన్ సిఐ జి తిరుమల్, ఎమ్మార్సీ కార్యాలయంలో ఎంఈఓ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గందె రాధిక, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏడిఏ గూండా సునీత, సిడిపిఓ కార్యాలయంలో సిడిపిఓ సుగుణ, కార్మిక శాఖ కార్యాలయంలో లేబర్ ఆఫీసర్ చందన, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ ఎడవల్లి కొండల్ రెడ్డి, కోర్టు కార్యాలయంలో న్యాయమూర్తి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇన్చార్జి ఒడితల ప్రణవ్, హాకీ క్లబ్ కార్యాలయంలో అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, డిసిఎంఎస్ వద్ద బిజెపి అధ్యక్షులు జి రాజులతోపాటు హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా న్యూ శాతవాహన, ఆల్ ఫోర్స్, విజ్ఞాన్, టేట్రా స్కూల్, మాంటిసోరి పాఠశాలల విద్యార్థులు ప్రభాత్ బేరి నిర్వహించారు. అన్ని పాఠశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ పాఠశాలల్లో జాతీయ నాయకుల, స్వాతంత్ర పోరాట యోధుల వేషధారణలతో పిల్లలు పాఠశాలకు వచ్చారు. పిల్లలకు బహుమతులను అందజేశారు.

భారత స్వాతంత్ర్య దినోత్సవము సందర్బంగా, హుజూరాబాద్ పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో పురపాలక సంఘ చైర్ పర్సన్ గందె రాధిక జాతీయ పతాకావిష్కరణ గావించి, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.. తదుపరి, పురపాలక సంఘములో వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను మరియు సామాజిక కార్యకర్త ను చైర్ పర్సన్, వైస్-చైర్ పర్సన్ మరియు కౌన్సిల్ సభ్యులు ప్రశంసా పత్రాలతో అభినందించారు.

  1. బండ వెంకటేష్, కంప్యూటర్ ఆపరేటర్
  2. మాటూరి వేణుగోపాల్, కంప్యూటర్ ఆపరేటర్
  3. మోకళ్ళ కొమురయ్య, వార్డు అధికారి
  4. ఇల్లందుల రజిత, వార్డు అధికారి
  5. రొంటాల సుధీర్, సానిటరీ జవాన్
  6. ప్రతాప రాజు, సానిటరీ జవాన్
  7. పోలు వినయ్ కుమార్, ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్
  8. నలుబాల వేణుగోపాల్, సామాజిక కార్యకర్త
  9. కరుమల్ల స్వరూప, MEPMA, C.L.R.P
  10. కత్తెరశాల సరస్వతి, MEPMA, R.P
  11. కొండపర్తి కుమార్, ట్రాక్టర్ డ్రైవర్
  12. ఎల్కపెల్లి అనిల్, పారిశుద్ధ్య కార్మికుడు
  13. బొరుగాల రేణుక, పారిశుద్ధ్య కార్మికురాలు వీరందరికి చైర్ పర్సన్ గందె రాధిక, వైస్-చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, వార్డు సభ్యులు కమిషనర్ సల్వాది సమ్మయ్య, మేనేజర్ ఆర్ భూపాల్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్ పెక్టర్ శ్రీ యం.డి. రషీద్, TPS ఎన్ అశ్వినీ గాంధీ, సానిటరీ ఇన్స్పెక్టర్ యం. కిషన్ రావు, పురపాలక సంఘ సిబ్బంధి మరియు మెప్మా ఆర్.పి.లు పాల్గొన్నారు. -ఈరోజు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఖిద్మత్ ట్రస్ట్ తరపున 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ ఆల్ హాజ్ మొహమ్మద్ అబ్దుల్ గాఫార్ జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు మొహమ్మద్ద్ యూసఫ్ ఖాన్, 17వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ ఇమ్రాన్, రెండవ వార్డు కౌన్సిలర్ యాదగిరి నాయక్, జామా మజీద్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముజహీద్ హుస్సేన్, జామ మసీద్ మాజీ ప్రెసిడెంట్ సయ్యద్ అబ్దుల్ కరీం, జామా మస్జిద్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ హబీబ్, జాయింట్ సెక్రటరీ మొహమ్మద్ ఇర్ఫాన్, కమిటీ మెంబర్లు ఎండి ఆంజాద్ , ఎండి ఇమ్రాన్, ఎండి యాసిన్ ఖాన్, సయ్యద్ అబ్దుల్ జమీల్ , రియసత్ అలీ, మరియు ట్రస్టు సభ్యులు ఎండి అయూబ్, సయ్యద్ అబ్దుల్ రహీమ్, ఎండి ముష్టాక్, హాఫిజ్ అబ్దుల్ ఫహీం, ముఫ్తీ షాకిర్ హుస్సేన్, ఎండి అలీం,ఎండి సలీం, ఎండి షఫీ, ఎండి ఇర్ఫాన్, ఎండి కౌసర్, ఎండి ఖదీర్, ఎండి రియాజ్, ఎండి బాబా, ఎండి అబ్ధుల్ ముబీన్, ఎండి అబ్దుల్ మతిన్, ఎండి అప్సర్, ఎండి కరీం, ఎండి ఆరిఫ్, ఎండి తౌసీఫ్, ఇల్యస్ ఖురేషి, ఎండి సల్మాన్, ఎండి బుద్దు, ఎండి హాబీబ్, ఎండి తశు, ఎండి ఏజాస్ ఖాన్, ఎండి యాదుల్ ఖురేషి, ఎండి సాబీర్ మరియు హుజూరాబాద్ ప్రజలు పాల్గొన్నారు.
  14. -ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు
  15. పివి సేవా సమితి & అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 78 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించి జెండావందన కార్యక్రమాన్ని నిర్వహించారు. తదనంతరం పీవీ సేవ సమితి అద్యక్షులు తూము వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మహానుభావుల త్యాగఫలం, నిస్వార్థ ఉద్యమాల ఫలితమే నేటి స్వతంత్ర ఫలమని అన్నారు. ప్రతి వ్యక్తి దేశ భక్తి కలిగి ఉండాలని,సమరయోధుల ఉద్యమ స్ఫూర్తిని గౌరవించి వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ అధ్యక్ష ఉపాధ్యక్షులు B. మనోజ్, Dr. రామలింగ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండ సంపత్ రెడ్డి, పిడి రాజిరెడ్డి, మాజి సర్పంచులు జనార్దన్ రెడ్డి పంజాల సుధాకర్, ముక్కేర కన్నయ్య, రావుల తిరుపతి రెడ్డి వేల్పుల ప్రభాకర్, గౌరి శంకర్, పసుల స్వామీ, సాగి శివప్రసాద్ రావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!