
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అన్నా తమ్ముళ్ల అక్కాచెల్లెళ్ల ఆప్యాయతలకు, ప్రేమలకు ప్రతిరూపమే ఈ రాఖి పౌర్ణమి పండుగ అని తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ వి అర్జున్ పేర్కొన్నారు. రాఖీ పండుగను పురస్కరించుకొని ఎల్వి అర్జున్ సోదరి స్వీటీ(అశ్విని) రాఖి (బంధనం)ని కట్టగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పురాణాలలో ఏ మహిళ అయితే సోదరునిగా భావించి రాఖీ కట్టుతుందో నీకు నేను రక్ష నాకు నీవు రక్ష అని భావించేవారని ఆ విధంగా నేటికీ కొనసాగుతుందన్నారు. రక్షాబంధన్ వేడుకలు ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ జరుపుకోవాలని, ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.








