
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:
రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు పర్ణికరెడ్డి, రాగమయి, కార్పొరేషన్ చైర్మన్లు బండ్రు శోభారాణి, నెరేళ్ల శారద, కాల్వ సుజాత, తదితరులు. సోదరి సీతక్కతో నా అనుబంధం…జన్మజన్మల బంధం అని సీఎం పేర్కొన్నారు. అలాగే మంత్రి పూర్ణం ప్రభాకర్ కు, ఎమ్మెల్సీ బల్మూర వెంకట్ కు మంత్రులు రాఖీ కట్టారు. రాఖీ పౌర్ణమి నాటి వెన్నెలంత చల్లనిది. ఈ పండుగ వేళ రాఖీ కట్టిన సీతక్కతో పాటు…రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ జీవితంలో పండు వెన్నెల లాంటి ఆనందాలు వెల్లివిరియాలని…మనసారా కోరుకుంటున్నాను.


