
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: TGSRTC బస్సులో గర్భిణికి డెలివరీ చేసి మానవత్వం చాటుకున్న వనపర్తి డిపోనకు చెందిన మహిళా కండక్టర్ జి.భారతికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్ణం ప్రభాకర్ సోమవారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. సమయస్పూర్తితో వ్యవహారించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సు సాయంతో సకాలంలో పురుడుపోయడం వల్లే తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ఒకవైపు సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూనే సేవాతర్పరతను చాటుతుండటం అభినందనీయం అని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
