
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: బేడ బుడగ జంగాల కాలనీలో పలు సౌకర్యాలు కల్పించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావుకి ఎస్సీ 57 బేడ బుడగ జంగాల కాలనీ హక్కుల పోరాట సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సిరిపాటి వేణు ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈరోజు ఎస్సీ 57 బేడ బుడగ జంగాల కాలనీ హక్కుల పోరాట సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సిరిపాటి వేణు ఆధ్వర్యంలో సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మరియు కొత్తగూడెం నియోజకవర్గం శాసన సభ్యుడు హుజురాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని బేడ బుడగ జంగాల కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇందిరమ్మ ఇండ్లు, స్మశాన వాటికలు, కమిటీ హాళ్లు.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని సాంబశివరావుకి వినతి పత్రం అందజేశారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇవ్వడం జరిగిందని ఎస్సీ 57 ఉప కులాల పోరాట సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సిరిపాటి వేణు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ఉపాధ్యక్షులు తూర్పాటి లింగయ్య, ప్రధాన కార్యదర్శి కానుకుర్తి రాజేష్, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు చింతల అంజి, తురుపాటి రాజు, మంత్రి, తురుపాటి సాయి తదితరులు పాల్గొన్నారు.







