
-ఆపద వస్తే అండగా ఉంటా..


-హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి ఆపద ఎదురైన వారికి అండగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం వివిధ కారణాలు వల్ల అనారోగ్యంతో చికిత్స పొందిన బాదిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా కొంత భరోసాగా ఉంటుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాకుండా అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికి ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రులతో సంబంధం లేకుండా ఎక్కడైనా సరే పూర్తిస్థాయిలో ఉచిత వైద్యాన్ని అందిస్తే బాగుంటుందన్నారు. అలాగే హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత ఉందని వెంటనే పూర్తిస్థాయి సిబ్బందిని ఆసుపత్రిలో కేటాయించాలని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలంతా ఎల్లప్పుడు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. ఎమ్మెల్యే దంపతులు శాలిని కౌశిక్ రెడ్డిలు లు స్వయంగా గడపగడపకు తిరుగుతూ 59 చెక్కులు 14,1000 పంపిణీ చేసి, వారి ఆరోగ్య పరిస్థితిలో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు ప్రతాప తిరుమల్ రెడ్డి, ముత్యంరాజు, తాళ్లపల్లి శ్రీనివాస్, కేసిరెడ్డి నరసింహారెడ్డి లావణ్య, మొలుగు పూర్ణచందర్, రమాదేవి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.