మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ టౌన్ సిఐ జి తిరుమల్ గౌడ్ ఆధ్వర్యంలో హుజురాబాద్ మండల పరిధిలో గల గ్రామాలలో ఎలాంటి అనుమతులు లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారనే సమాచారంతో బెల్ట్ షాపులపై సిబ్బందితో తనిఖీలు నిర్వహించి 36 లీటర్ల 495 మిల్లి మీటర్ల మధ్యము, రూ. 20,820 విలువ గల మద్యం సీజ్ చేసినట్లు సిఐ తిరుమల్ గౌడ్ తెలిపారు. కొన్ని బెల్ట్ షాపులు అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా మధ్యమును (లిక్కర్) అమ్ముతుండగా ఆ బెల్ట్ షాపులల్లో పంచుల సమక్షంలో తనిఖీ చేసి షాపులో ఉన్న మద్యమును సీజ్ చేసి వారినీ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీలలో అందాద 36 లీటర్ల 495 మిల్లి మీటర్లు మధ్యము, అందాద రూ.20,820 ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల విలువ గల మధ్యమును స్వాధీనం చేసుకొని బెల్ట్ షాప్ ని నిర్వహిస్తున్న వారిపై కేసు నమోదు చేశామన్నారు.
ఎవరైనా హుజురాబాద్ పట్టణ మరియు మండలంలో అనుమతులు లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటానని సిఐ తిరుమల్ గౌడ్ హెచ్చరించారు.