
Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల రైతులు రుణమాఫీ కోసం తమ కుటుంబ వివరాలను వ్యవసాయ శాఖ అధికారులకు అందివ్వాలని హుజురాబాద్ వ్యవసాయ సహాయ సంచాలకురాలు గుండా సునీత తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ వ్యవసాయశాఖకి రుణమాఫీ కొరకు వచ్చిన ఫిర్యాదులలో అధిక మొత్తంలో కుటుంబ నిర్ధారణ పైన రావడం జరిగిందని అన్నారు. దీనికోసం ప్రభుత్వం వ్యవసాయ శాఖ నుండి ఒక యాప్ ను రూపొందించడం జరిగిందని తెలిపారు. హుజురాబాద్ డివిజన్ పరిధిలో 4661 రుణమాఫీ కావలసిన సభ్యుల జాబితాను వ్యవసాయశాఖ అధికారుల లాగిన్లలో పొందుపరచడం జరిగిందని, ఈ రైతులకు కుటుంబ నిర్ధారణ జరగవలసి ఉందో వారు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారి నుండి నిర్ధారణ చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. దీనికోసం రైతులు అఫీడవిట్ ఫారం(రైతు ధ్రువీకరణ పత్రం)
ను సంతకం చేసి వ్యవసాయ అధికారి నుండి యాప్ లో పొందుపరచుకోవాలని ఆమె సూచించారు. వ్యవసాయ అధికారి గ్రామాల వారీగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం రైతులు ఆయా గ్రామాలలో కుటుంబ నిర్ధారణ చేసుకొనవచ్చునని, ఆధార్ నంబరు మార్పు లాంటివి నేరుగా బ్యాంకుకు వెళ్లి సరి చేసుకోవాలని ఆమె తెలిపారు.
