మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : పిల్లలు చదువుపై శ్రద్ధ ఉండాలని, బాగా చదివి పదవ తరగతిలో రాణించాలని జిల్లా విద్యాధికారి ch.వెంకట సూర్య జనార్దన్ రావు అన్నారు. బుధవారం హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామంలోని జడ్పిహెచ్ ఎస్ పాఠశాలలో విద్యార్థులతో ఆయన మాట్లాడారు. చదవడం పై ఎక్కువ శ్రద్ధ చూపించాలన్నారు. రాష్ట్ర గవర్నర్ నుండీ సీఎం, విద్యాశాఖ మంత్రి, ఎస్ పిడి, కలెక్టర్, డీఈఓ, ఎం ఈఓ ల పేర్లు అడిగి.. ప్రతీ ఉన్నత పాఠశాలలో ఉన్న IFP (ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్) ని ప్రతీ విద్యార్ధి ఉపయోగించడo పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతి టీచర్ విద్యార్థిని విద్యార్థులను దత్తత తీసుకొని వారు ఎలా చదువుతున్నారో చూస్తూ అన్ని రంగాల్లో రాణించేలా, చదువే రాకపోతే వివిధ భాషల్లో ఉన్న లెటర్ ను కూడా చదవకపోతే, రాబోవు కష్టాలను తెలియ పరుస్తూ జీవన ప్రమాణాలను నేర్పించాలన్నారు. భాష ఉపాధ్యాయులే కాకుండా సబ్జెక్టు ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల దత్తత పై శ్రద్ధ చూపించాలన్నారు. చదువులో చురుకైనా విద్యార్థులకు చిన్న విద్యార్థులను అటాచ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, బేతి తిరుపతిరెడ్డి, ఆవుల పద్మశ్రీ, ఎం. వెంకటరమణ, ఇర్రి శ్రీనివాస్ రెడ్డి, ఎం రమేష్ బాబు, పిడి సత్యానందం తదితరులు పాల్గొన్నారు.
