
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, సైదాపూర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామానికి చెందిన ప్రజలు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బుధవారం శ్రావణ మాసం పురస్కరించుకుని వన భోజనాలకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మేకపోతులు, కొబ్బరికాయలతో మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం పాడి పంటలు, పిల్లా పాపలు చల్లగుండాలని వన దేవతలను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు మొలుగూరి తిరుపతి, అందే వెంకటయ్య, రమేష్, కనుకం ఎల్లయ్య, పారునంది రాజ్ కుమార్, మెరుగు లచ్చయ్య, రాకేష్, రవిచందర్, రాజు, వెంకటయ్య, సాయి, రాము, మచ్చయ్య, సమ్మయ్య, సదయ్య, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

