
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీస్ విభాగానికి రాష్ట్ర ఇన్చార్జిగా నియమించబడిన యూత్ కాంగ్రెస్ నాయకుడు తిప్పారపు సంపత్ ను ఎమ్మార్పీఎస్ నాయకులు బుధవారo హుజురాబాద్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంపత్ మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్, ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రుద్రారపు రామచంద్రం, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు మారేపల్లి శ్రీనివాస్, దేవునూరి రవీందర్ , కలవల మల్లయ్య, వేల్పుల రత్నం, రామారపు సదానందం, మిడిదొడ్డి రాజయ్య, వేల్పుల ప్రభాకర్, మోరే సతీష్, పాత రఘుపతి, ఇల్లందుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

