
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజరాబాద్ మండలం రంగపూర్ గ్రామంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మెరుగు కొమరమ్మ ఇంట్లోకి వరద నీరు రావడంతో ఒంటరిగా ఉన్న మహిళకు ఏం చేయాలో అర్థం కాకపోవడంతో హుజురాబాద్ అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం అందించి సాయం కోరింది. స్పందించిన సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి ఇంట్లో నుంచి నీటిని బయటకు పంపించి మహిళకు సాయం అందించారు. దీంతో గ్రామస్తులతో అగ్నిమాపక శాఖ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది లీడింగ్ ఫైర్ మెన్ సురేందర్, ప్రభాకర్, అనిల్ కుమార్, అశోక్, సంపత్, రాజయ్యలు పాల్గొన్నారు.

.