
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ సెప్టెంబర్ 2: హుజురాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపేట గ్రామంలో సోమవారం లక్ష్మీనరసింహ హాస్పిటల్ హన్మకొండ వారి సౌజన్యంతో జనవికాస స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో లక్ష్మీ నరసింహ హాస్పిటల్ స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ రాజేశ్వరి గ్రామంలోని 100 మంది స్త్రీలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జన వికాస సంస్థ హుజురాబాద్ సెంటర్ మేనేజర్ ఎండి ఖాజాభీ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ జన వికాస సెంటర్ మేనేజర్ ఎండి ఖజాభీ, సూపర్వైజర్ రవీందర్, నర్సులు ఫారా, రాజేశ్వరి మరియు హుజురాబాద్ సెంటర్ కో ఆర్డినేటర్ లీల, రజిత మరియు కారోబార్ లు తదితర మహిళలు పాల్గొన్నారు.






