Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ మండలం చెల్పూరు గ్రామానికి చెందిన ఓరిగంటి తిరుపతి బాల్యం నుండి కష్టపడి చదువులో రాణించి 2006 డీఎస్సీలో ఉపాధ్యాయునిగా ఎంపిక కాబడి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో విద్యార్థులకు బోధన అభ్యసన పరికరాలను ఉపయోగిస్తూ, సృజనాత్మకతతో కూడిన బోధన చేస్తూ ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపి భావి పౌరులను తయారు చేసిన ఘనత తిరుపతికి దక్కిందనడంలో సందేహం లేదు. తాను విద్యార్థులతో మమేకమై బోధిస్తుంటే ప్రతి విద్యార్థి నేర్చుకోవాలనే తపనతో ముందుకు సాగేవారు. తిరుపతి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కాబట్టి తరగతి గదిని సమాజానికి దగ్గరగా తీసుకెళ్లి ప్రత్యక్ష బోధన చేయడంలో ఆయనకు ఆయనే సాటి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఈవో లు సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయి, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయి, జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు పాల్గొన్నాయి.







