
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఇంచార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ కే మల్లారెడ్డి అధ్యక్షతన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కే మల్లారెడ్డి మాట్లాడుతూ… సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర యొక్క ప్రాధాన్యతను వివరించారు. మరియు భారతదేశానికి సర్వేపల్లి రాధాకృష్ణ చేసిన సేవలను కొనియాడారు. అనంతరం అధ్యాపకులని విద్యార్థులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జె.సరళ, ఝాన్సీ రాణి, అధ్యాపకులు డాక్టర్ జి.ఓదేలు, డాక్టర్ బి.సుమలత, వి.రమా, డాక్టర్ కే. నరేందర్ రెడ్డి, ఐ మంగమ్మ, డాక్టర్ బి.మహిపాల్ రెడ్డి, డాక్టర్ వి.స్వరూపరాణి, డాక్టర్ బి.రేణుక, డాక్టర్ జి.స్వప్న, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
–ప్రభుత్వ జూనియర్ కళాశాలలో
హుజురాబాద్ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేడు గురుపూజ దినోత్సవం సందర్భముగా మొదటి ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి అయిన డాక్టర్.సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సందర్భముగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వి.అంజనేయరావు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫోటోకు పూలమాలలతో అలంకరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ మీ ఆంజనేయరావు మాట్లాడుతూ ఈ ప్రపంచంలో అన్ని రంగంలోకెళ్లా ఉపాధ్యాయిని పాత్ర చాలా గొప్పది, ఎందుకంటే అన్ని రంగాలవారిని తీర్చిదిద్దే బాధ్యత ఒక్క గురువుకు మాత్రమే ఉంటుంది, కాబట్టే సర్వేపల్లి రాధాకృష్ణన్ కి అత్యున్నత స్థానములు ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవులు వచ్చాయి అన్నారు. కాబట్టి విద్యార్థులు మీరు కూడా చక్కగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండాలని నిర్దేశించారు. అనంతరం కళాశాల NSS ప్రోగ్రాం ఆపిసర్ సుగుణ ఆధ్వర్యంలో విద్యార్థుల చేత కళాశాల అధ్యాపకలందరిని చేనేత వస్త్రాలతో సత్కరించారు.
–విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాద్యాయు దినోత్సవ వేడుకలు
హుజురాబాద్ మండలం సింగపురంలో విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో మాజీ రాష్ట్రపతి, భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఫోటోకి పూలమాల వేసి విద్యార్థులుకు రాధాకృష్ణ గురించి వివరించిన కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ శనిగారపు రజిత. అలాగే ఉపాధ్యాయులు, వారి జయంతి రోజున ఉపాద్యాయ దినోత్సవం జరుపుకోవడం గర్వకారణం అన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే ఉపాధ్యాయుల బాధ్యత చాలా గొప్పదని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ గొబ్బెట తిరుపతి, కో-ఆర్డినేటర్ పోతిరెడ్డి హరీష్, తాళ్ళపెళ్లి అజయ్, గాజుల శారదా, దుస గణేష్, చల్లురి సతీష్, సదయ్య, బాస్కర్, మహేష్, రచన విద్యార్థులు పాల్గొన్నారు.








