
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్: హైదరాబాద్ లోని గాంధీభవన్లో ఆదివారం సాయంత్రం అట్టహాసంగా జరిగిన నూతన పీసీసీ అధ్యక్షుడు
బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి బీసీ బిడ్డకు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పదవీ ప్రమాణ స్వీకారంతో పాటు బాధ్యతలు స్వీకరించిన పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు రాజేందర్ రావు హర్థిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తామని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రతి ఇంటింటా అవగాహన కల్పిస్తామని రాజేందర్ రావ్ పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియామకానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.






