-గ్రామగ్రామాన పట్టభద్రులకు ఎన్రోల్మెంట్ పై అవగాహన
–మేము సైతం అంటూ ముందుకొస్తున్న యువ సైన్యాలు
–మారుమూల గ్రామాలలో చాపకింద నీరులా ప్రచారాలు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, (హుజురాబాద్) కరీంనగర్: త్వరలో జరిగే గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డిని గెలిపించాలని ఆయన ప్రధాన అనుచరులు, అభిమానులు గ్రామగ్రామాన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సుమారు వంద మంది బృందాలుగా ఏర్పడి ఎమ్మెల్సీ పరిధిలోని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలలోని పట్టణాలతో పాటు మారుమూల ప్రాంతాలలో తిరుగుతూ నరేందర్ రెడ్డి పేరును విస్తరింపజేస్తూ చాపకింద నీరులా ప్రచారాలు చేపడుతున్నారు. పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అవగాహన కల్పిస్తూ ఎన్ రోల్ మెంట్ పత్రాలను అందజేస్తున్నారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం, విద్యార్ధులకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించడం కోసం నిరంరతం కృషి చేసే సత్తా కలిగిన నరేందర్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని మేధావులను, పట్టభద్రులను కోరుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ప్రచారం ఊపందుకోగా మరో వైపు అతని అనుచరులు, అభిమానులు ప్రత్యర్థి అభ్యర్ధులకు అంతుచిక్కని విధంగా ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. దాదాపు లక్ష మందికి పైగా కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఎన్రోల్మెంట్ పత్రాలను అందించినట్లు తెలుస్తోంది. ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు మేము సైతం అంటూ పని చేయడానికి యువ సైన్యాలు ముందుకు వస్తున్నాయి. దీంతో నాలుగు జిల్లాల్లో నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ప్రచారం జోరం దుకుంటుంది.