
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రభుత్వం వెంటనే ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసీ బడ్జెట్ ను కేటాయించాలని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు డిమాండ్ చేశారు.
తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం కరీంనగర్ జిల్లా కమిటీ సమావేశం హుజురాబాద్ పట్టణంలో జిల్లా అధ్యక్షులు కూతాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు హాజరై మాట్లాడుతూ..సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏబిసిడి వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎస్టీల వర్గీకరణ చేపట్టే ముందు విద్యా ఉద్యోగ ఉపాధి ఆర్దిక, సామాజిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందని తెగలను గుర్తించి ఎస్టీలో ఏ బి సి డి వర్గీకరణ అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వర్గీకరణ తీర్పును గౌరవించి ఎస్టీ వర్గీకరణ ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏబిసిడి వర్గీకరణ చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం క్రిమిలేయర్ పరిగణంలోకి తీసుకోవద్దని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి ఏబిసిడి వర్గీకరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో దాదాపుగా 8 లక్షల జనాభా కలిగి ఉండి విద్యా ఉద్యోగ ఉపాధి ఆర్దికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నామని ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే ప్రత్యేక ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి అవసరమైన బడ్జెట్ ని కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎరుకల కార్పొరేషన్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసి ఎరుకల కుటుంబాలు కులవృత్తితో పాటు విద్య ఉద్యోగ ఉపాధి సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ప్రభుత్వానికి గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న గిరిజన మంత్రిత్వ శాఖతో ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు కలవాలంటే తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని, ఆ ప్రత్యేక శాఖకు మంత్రినీ కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కేటాయించాలని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనేటి రాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవెల్లి రాజలింగం, జిల్లా ప్రధాన కార్యదర్శి కుతాడు శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బండి సమ్మయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కూతాడి కుమార్, మానుపాటి మల్లేశం, జిల్లా నాయకులు మొగిలి సంపత్ తదితరులు పాల్గొన్నారు.


