
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలంలోని ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన కోట లక్ష్మణ్ అనారోగ్య తో మృతి చెందగా శనివారం ఆయన కుటుంబాన్ని సామాజికవేత్త సబ్బని వెంకట్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపి రూ .10,000/- ఆర్థిక సహాయం చేశారు. అలాగే వారి పిల్లల చదువుల నిమిత్తం అయ్యే ఖర్చులో స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి ఫీజు రాయితీ చేయించారు. లక్ష్మణ్ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంగెం సత్యనారాయణ, చిలుకమారి శ్రీనివాస్, కుడికాల సాయి, ఇప్పలపల్లి శ్రీనివాస్, జనార్ధన్, వడ్డేపల్లి సాయి, తదితరులు పాల్గొన్నారు.
