
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పద్మశాలి అఫీషియన్స్ అండ్ ప్రొఫెషనల్ (పోప ) కరీంనగర్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హుజురాబాద్ పట్టణానికి చెందిన ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడు బండి రాజశేఖర్ కు పద్మ రత్న అవార్డును ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నిస్వార్ధంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేస్తూ వారిని అన్ని విధాలుగా తీర్చిదిద్దుతున్నందుకు గుర్తించి తనను పద్మ రత్న అవార్డుకు ఎంపిక చేయడం, ఈరోజు పద్మ రత్న అవార్డును ప్రధానం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. పోప ఆధ్వర్యంలో ఇలాంటి అవార్డులు ప్రధానం చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయుల బాధ్యతను మరింతగా పెంచడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డు ప్రదానం చేసి సేవ భావాన్ని, పద్మశాలి కులస్తుల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఈ అవార్డును ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మరింతగా రాణించేందుకు కృషి చేస్తానని రాజశేఖర్ తెలిపారు. కాగా రాజశేఖర్ కు పద్మ రత్న అవార్డు రావడం పట్ల హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, సీనియర్ విద్యార్థులు, ఆయన మిత్రులు అభినందనలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు.



