
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ సెప్టెంబర్ 30: కళ్ళ ముందు ఆడి పాడిన ఆ చిన్నారి ఇక లేదు అన్న విషయం కన్నా తల్లితండ్రులతో పాటు కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టది. హుజురాబాద్ పట్టణంలోని విద్యానగర్ 30వ వార్డులో నివసిస్తున్న రావుల వెంకటేశ్వర్లు- రజని దంపతులకు ఒక కుమారుడు, ఓ కుమార్తె కలరు. ఏకైక కుమార్తె అయిన రావుల రుషిత 10 సంవత్సరాల వయసులో డెంగ్యూ వ్యాధి బారిన పడి అకాల మరణం చెందింది. అల్లారు ముద్దుగా ఆడిపాడుతున్న ఆ చిన్నారి ఇలా డెంగ్యూ మహమ్మారి బారిన పడి మృతి చెందడం బాధాకరమని బంధుమిత్రులు, వార్డు ప్రజలు, కన్నీటీ పర్యంతమయ్యారు. రిషిత మృతదేహాన్ని చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. రిషిత తండ్రి రావుల వెంకటేశ్వర్లు హుజురాబాద్ పట్టణంలోని జమ్మికుంట రోడ్డులో ఓ సామిల్ నడుపుతున్నాడు. రిషిత గ్రీన్ సెడ్జ్(విపిఎస్) స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నది. రిషిత అకాల మరణానికి పాఠశాల యజమాన్యంతో పాటు తోటి విద్యార్థులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. రిషిత మరణం పాఠశాల యజమాన్యాన్ని కలచివేసింది. తమ మిత్రులు బతుకమ్మ ఆటలు పాటలు మరి రెండు రోజుల్లో ఆడుకుందామని చెప్పి ఇంతలోనే పరలోకానికి వెళ్లిపోయిందని మిత్రులు కంటతడి పెట్టుకున్నాం. చిన్నారి మృతి పట్ల ఆ వార్డు ప్రజాప్రతినిధులు, నాయకులు, కుల సంఘం నాయకులు సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
