
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ మండలం రంగాపూర్, రాంపూర్ గ్రామాలలోని పంట పొలాలను హుజురాబాద్ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి జీ సునిత సందర్శించి రైతులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి పంటలో ఎదురయ్యే సుడి దోమ, వరి కంకినల్లి, బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు గురించి తెలియజేస్తూ వాటి నివారణకు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులను తెలిపారు. వరి సుడి దోమ నివారణకు డైనోతెఫ్యూరాన్ 0.5 gr లేదా పైమెట్రోజైన్ 0.5gr 1లీ నీటికి కలిపి కుదుళ్లు తడిచేలా పిచికారి చెయ్యాలని తెలియజేస్తూ.. వరి కంకి నల్లికి ప్రోపగైట్ 1.5ml లేదా అబాసిన్ 0.4 ml 1లీ నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. అదే విధంగా బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు నివారణకు టేబుకొనజోల్+ ట్రైఫ్లాక్సీస్ట్రోబిన్ 0.5 gr లేదా అగ్రిమైసిన్ 0.4 gr 1లీ నీటికి కలిపి పిచికారి చెయ్యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల వ్యవసాయ అధికారి సిహెచ్ బూమిరెడ్డి, ఏఈఓ టి నిఖిల్ కుమార్ మరియు రైతులు పాల్గొన్నారు.
