
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి,హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని పలు లాడ్జిలను, పట్టణ శివారులోని పలు ప్రాంతాలను గురువారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు హుజురాబాద్ టౌన్ సిఐ జి తిరుమల్ గౌడ్ తెలిపారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను,
పట్టణంలో కొత్త వ్యక్తులు, అపరిచిత వ్యక్తులు ఉన్నారా అన్న కోణంలో తనిఖీలు చేసినట్లు ఆయన తెలిపారు. పట్టణంలోని పలు లాడ్జిలను తనిఖీ చేసి అందులో ఉంటున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. హుజురాబాద్ చుట్టుపక్కల కొత్తగా నివసిస్తున్న వారిని విచారించినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐతో పాటు పలువురు పోలీసులు పాల్గొన్నారు.



