
మండల యాదగిరి, స్వర్ణ ఉదయం ప్రతినిధి,హుజురాబాద్: హుజురాబాద్ సబ్ ట్రెజరీ కార్యాలయంను గురువారం జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విధులను నిర్లక్ష్యం చేసిన పలువురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిల్లలను పెండింగ్ లేకుండా పాస్ చేయాలని, అనినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా పని చేయాలని అన్నారు. పించన్ కు గ్రాటుట్రీ’, ‘కమ్ముటేషన్ బిల్లు, గ్రామ పంచాయితీ చెక్కులు, డిఏ, ఇతర ఏరియర్స్ బిల్లులను ఆలస్యం లేకుండా ఈ-కుబేర్ లో అప్డ్ చేయాలని అన్నారు. విధులను నిర్వహించే సమయంలో అవినీతికి తావిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. బాధ్యతాయుతంగా సేవలు అందించాలని అన్నారు. ఈ సందర్భంగా సబ్ ట్రెజరీ కార్యాలయంలోని రికార్డులను ఆయన తనిఖీ చేసిన అనంతరం జమ్మికుంట సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని సైతం తనిఖీ చేశారు. ఈ తనిఖీలో హమిత్ ఖాన్, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
