
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణం లో అక్టోబర్ చివరి వారంలో అత్యంత వైభవంగా జంబుద్వీప మహాకవి చక్రవర్తి ఎర్ర ఉపాలి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కవులు, కళాకారులు, మేధావులు కలుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కరపత్రాల ఆవిష్కరణలో భాగంగా జమ్మికుంట పట్టణంలో టిజిపిఎ రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ కళాకారుడు అంబాల ప్రభాకర్ (ప్రభు) నివాసంలో బుధవారం కరపత్రాల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు ప్రజా సంఘాలు, బహుజన మేధావులు కళా సంఘాలు, మేధావులు, సాహితీవేత్తలు కవులు గాయకులు పెద్ద ఎత్తున తరలి ఎర్ర ఉపాళి విగ్రహావిష్కరణను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎర్ర ఉపాలి కుమారుడు ఎర్ర సూర్య నేనే, ప్రముఖ బహుజన వాగ్గేయకారుడు మచ్చ దేవేందర్, ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు రామంచ భరత్ తదితరులు పాల్గొన్నారు.
