
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సహా చట్టం సామాన్యులకు ఒక వజ్రాయుధం లాంటిదని, కనుక వెంటనే రాష్ట్రంలో సమాచార కమిషనర్లను నియమించాలనీ యునైటెడ్ ఫోరంఫర్ ఆర్టిఐ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ గూడూరి స్వామిరెడ్డి పేర్కొన్నారు. హుజురాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సహా చట్టంను కాపాడవలసిన బాధ్యత మీడియా, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు యువతపై ఉన్నదని యునైటెడ్ ఫోరంఫర్ ఆర్టిఐ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ స్వామి రెడ్డి అన్నారు. సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12 అమలులోకి వచ్చిందనీ, ఈ చట్టం ఏర్పడి 19 సంవత్సరాలు ముగించుకొని 20 సంవత్సరాలలోకి అడుగు పెట్టిందన్నారు. ఈ చట్టం సామాన్యులకు ఒక వజ్రాయుధం అని, ఈ చట్టం ద్వారా అనేక అంశాలను తెచ్చిన ఘనత సహా చట్టం కార్యకర్తలదనీ గుర్తు చేశారు. అధికారులు చేసే పనులలో పారదర్శకత ఉండాలన్నారు. సమాచార హక్కు చట్టం ఒక మైలురాళ్లుగా పనిచేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఎలా వినియోగించుకుంటున్నారో, అలానే సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ చట్టాన్ని చాలామంది అధికారులు నిర్లక్ష్యం చేయడం కాలయాపన చేయడం జరుగుతుందనీ ఆరోపించారు. ప్రైవేటు సంస్థలు ప్రభుత్వం ద్వారా ప్రత్యక్షంగానో, ప్రైవేటు గాను రాయితీలు పొందుతున్నప్పుడు సమాచారం ఇవ్వవలసిందే అని సెక్షన్ 2(జె )చెబుతుందన్నారు. ఈ చట్టం ప్రకారం 30 రోజులలో సమాధానం ఇవ్వవలసి ఉంటుందనీ, ఇవ్వని ఎడల 19(1) మొదటి అప్పిలు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అప్పటికి సరైన సమాచారం ఇవ్వకపోతే 19(3) సమాచార కమిషన్ కు అప్పీలు చేయాలనీ, అప్పుడు సమాచార కమిషన్ ఇరువర్గాలకు నోటీసులు జారీ చేసి విచారిస్తుందన్నారు. ఇరువాదనలు విన్న తర్వాత సమాచారం సరియైనది కానప్పుడు, సమాచార అధికారికి ఒక రోజుకు 250 రూపాయల నుండి 25 వేల వరకు జరిమానా విధిస్తుందనీ స్వామి రెడ్డి చెప్పారు. నిర్లక్ష్యానికి గాను ఆ అధికారికి, సర్వీస్ బుక్ లో రీమార్క్ కు ఆదేశాలిస్తుందన్నారు. 30 రోజులలో సమాధానం ఇవ్వని ఎడల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, సమాచార అధికారులపై కేస్ కూడా వేయవచ్చునని, ఐపీసీ సెక్షన్ ప్రకారం, వారిపై 166, 167, 220, 420, 406, 407, 408 మొదలగు సెక్షన్ల ప్రకారం శిక్షకు ఆర్హుడు అవుతాడన్నారు. సమాచార కమిషనర్ పని చేయనప్పుడు అప్పీల్దార్లు కోర్టుకు వెళ్ళవచ్చునని, సమాచార హక్కు చట్టంపై, కొందరు అధికారులు దుష్పాచారం చేస్తూ, ఈ సమాచారం నీకెందుకని, నీవు ఎవరు అని, దీనిని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఈ సమాచార హక్కు చట్టం గురించి పదవ తరగతి పాఠ్యాంశంలో ఉన్న గత ప్రభుత్వం తొలగించిందనీ. ఈ చట్టంపై గత ప్రభుత్వానికి, చిన్న చూపు ఉందనీ. సరియైన సమయంలో సమాచారం ఇవ్వకుండా, కాలయాపన చేసిందన్నారు. ఈ ప్రభుత్వం సమాచార కమిషనర్లను నియమించి, సమాచార హక్కు చట్టాన్ని పదో తరగతి పాఠశాలలో చేర్పించాలని, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఐ నియోజకవర్గ కన్వీనర్ రావుల రాజేశం, UF/rti ప్రచార కార్యదర్శి తులసి రమణమూర్తి, గూడూరి చైతన్యరెడ్డి, కంకణాల జనార్దన్ రెడ్డి, చందుపట్ల జనార్ధన్, బండ లక్ష్మారెడ్డి, బెల్లీ సతీష్, ఇప్పలపల్లి చంద్రశేఖర్, మోర్తాల సమ్మయ్య, పసుల స్వామి, ఇల్లందుల సమ్మయ్య, గరవేణి క్రిస్టమస్, సంద్యాల వెంకన్న, మొలుగూరి మొగిలయ్య, పోలేపాక విల్సన్ తదితరులు పాల్గొతదితరులు

