
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ పాఠశాలలో వారాంతం రోజు అయినా శనివారం రోజున లీడ్ కరికులంలో భాగంగా నిర్వహించిన స్టూడెంట్ లేడ్ కాన్ఫరెన్స్ విజయవంతమైందని పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులు తయారుచేసిన వివిధ రకాలు చార్టులు, ప్రాజెక్టులు అందరిని ఆశ్చర్య పరిచాయి. ఈ సందర్భంగా గత వారం రోజుల నుండి తల్లిదండ్రుల సహకారంతో పాఠశాల టీచర్లు, పిల్లలకు వివిధ రకాల చార్టులు, మోడల్స్ తయారు చేపించి దానిని ప్రదర్శింపజేశారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పాఠశాలకు ముఖ్య అతిథిగా హుజూరాబాద్ మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్ అలాగే పాఠశాల మార్గదర్శకులు, రిటైర్డ్ టీచర్ జయవర్ధన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ విద్యార్థులకు మూస ధోరణితో చదువు చెప్పకుండా, వారిలో ఇన్నోవేషన్ తో కూడిన చదువు, విలువలు నేర్పుతున్నందుకు పాఠశాలను అభినందించారు. అలాగే తల్లిదండ్రుల సహాయ సహకారాలు ఏ పాఠశాల కైనా అవసరమని, పిల్లలని మొబైల్ ఫోన్ లకి, టీవీలకి దూరంగా ఉంచుతూ పిల్లలతో ప్రతిరోజు కాసేపు గడపాలని కోరారు. మారుతున్న సమాజంలో గతానికి ప్రస్తుతానికి చాలా తేడా ఉందని, పిల్లలను మార్పుకు అనుకూలంగా విద్యను అందిస్తున్న పాఠశాలను మరోసారి అభినందించారు. తదనంతరం పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ మాట్లాడుతూ కోవిడ్ తర్వాత పాఠశాలలు తిరిగి తీరుచుకున్న అనంతరం విద్యార్థుల యొక్క ప్రవర్తనలో తేడాలు గమనించిన తర్వాత పిల్లలకు ఒక మంచి కరికులం అవసరమని తెలుసుకొని పాఠశాలలో లీడ్ కరికులంను ఇంప్లిమెంట్ చేశామని దీనివలన పిల్లల అభిరుచులలో నైపుణ్యాలలో తేడాలు గమనించామని, దానివలన మంచి ఫలితాలు సాధించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్, పాఠశాల మార్గదర్శకులు జయవర్ధన్, కరస్పాండెంట్ కోటేశ్వర్, డైరెక్టర్ తిరుపతి యాదవ్, ఫౌండర్ మహిపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ కొండబత్తిని శ్రీనివాస్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.


