
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బిడ్డ.. బాగున్నావా ! నువ్వు.. ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్న బిడ్డ అని అంటూ ఓ వృద్ధురాలు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్ ను నిండు మనసుతో ఆశీర్వదించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది… అన్ని మంచి పనులే జరుగుతున్నాయి.. నువ్వు కూడా రానున్న రోజుల్లో మా ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్న అంటూ.. ఇల్లందకుంట మండల కేంద్రంలోని భోగంపాడు గ్రామములో ఓ వృద్ధురాలు దీవెనర్తి ఇవ్వడం పలువురిని ఆకట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వడిదల ప్రణవ్ భోగంపాడులో ఓ కార్యకర్త గృహప్రవేశానికి వెళుతుండగా మార్గమధ్యంలో రోడ్డు మీద వున్న ఆ వృద్ధురాలిని చూసిన వోడితల ప్రణవ్ కార్ ను ఆపి వృద్ధురాలు వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆ వృద్ధురాలు ఆయన రెండు చేతులు పట్టుకొని.. మీ తాత గారి ఆశీస్సులతో ఇంకా మంచి పనులు చేయాలని మంచి పదవిలో ఉండాలని ఆశీర్వదించడం ప్రణవ్ కు ప్రజలలో పెరుగుతున్న ఆదరణకు నిదర్శనంగా నిలుస్తుంది.
